హైదరాబాద్‌తో ఎఫ్‌సీ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం

TCS vice president v rajanna talking about FC Kohli - Sakshi

టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఐటీ రంగ పితామహునిగా పరిగణించే దిగ్గజం ఫకీర్‌ చంద్‌ కోహ్లీ (ఎఫ్‌సీ కోహ్లీ)కి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీ రాజన్న పేర్కొన్నారు. తమ సంస్థ వ్యవస్థాపక సీఈవో అయిన కోహ్లీ పేరిట హైదరాబాద్‌లోని ఐఐఐటీలో ’కోహ్లీ సెంటర్‌ ఆన్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్‌’ను టీసీఎస్‌ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ దేశంలోని అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే నగరంలో 2015లో సైబర్‌నెటిక్స్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌ (కేసీఐఎస్‌) కూడా ఏర్పాటైంది.

వయోజన అక్షరాస్యత కార్యక్రమానికి కోహ్లీనే ఆవిష్కర్త. ఈ ప్రోగ్రామ్‌లో 4–6 వారాల్లో ప్రాథమిక భాషలను నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారని రాజన్న గుర్తు చేసుకున్నారు. కోహ్లీ కొన్నేళ్ల పాటు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి బోర్డ్‌లోనూ పనిచేశారు. 2016లో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) కోహ్లీని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌తో సత్కరించింది. మంత్రి కేటీ రామారావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top