ఫ్రెషర్లకు దేశీయ ఐటీ దిగ్గజాలు గుడ్‌న్యూస్‌..!

TCS, Infosys, Wipro To Hire More Than 1 Lakh Freshers - Sakshi

కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడటంతో దేశీయ ఐటీ సంస్థలు నియామక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐటీ సంస్థలకు కొత్త కాంట్రాక్టులు వస్తుండటంతో డిమాండ్‌ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసీస్, విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి.

టీసీఎస్
దేశంలోని అతిపెద్ద ఐటీ  కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అన్నీ క్యాంపస్ ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనుంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అవతరించిన టీసీఎస్ 2020లో క్యాంపస్ల నుంచి 40,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. "భారతదేశంలోని క్యాంపస్ ల నుంచి మేము గత సంవత్సరం 40,000 నియమించుకున్నాము. ఈ ఏడాది 40,000 లేదా అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు" ఆ కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ గత వారం చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవని ఆయన అన్నారు. గత ఏడాది, మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

ఇన్ఫోసీస్ 
ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ వై22 ఆర్ధిక సంవత్సరంలో 35,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియాయమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు క్యూ1 సంపాదన ప్రకటనలో తెలిపారు. ఇన్ఫోసిస్ 2022 జూన్ త్రైమాసికం చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య  2.67 లక్షలు, 2021 మార్చి త్రైమాసికంలో ఈ సంఖ్య 2.59 లక్షలు. "ఇటీవలి కాలంలో డిజిటల్‌ సంస్థలకు డిమాండ్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 35,000 కాలేజీ గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ ద్వారా ఈ డిమాండ్ ను తీర్చాలని మేం యోచిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.

విప్రో
విప్రో ఐటీ ఉద్యోగుల సంఖ్య 2,00,000 మైలురాయిని దాటింది. విప్రో సంస్థ ఈ ఏడాది తన మొదటి త్రైమాసిక సమావేశంలో ఉద్యోగుల సంఖ్య 2,09,890కకు చేరుకున్నట్లు తెలిపింది. మొదటి త్రైమాసికంలో 10,000 కంటే ఎక్కువ ఇతర నియమకాలతో పాటు 2,000 కంటే తక్కువ ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 6,000 ఫ్రెషర్లను నియమించికొనున్నట్లు విప్రో తెలిపింది. వచ్చే ఏడాది ఎఫ్ వై23లో 20,000కి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తుంది. అయితే, విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే పెద్ద సంస్థల నుంచి కాంట్రాక్టులు రావడంతో అధిక ఒత్తిడిని నివారించడానికి విప్రో భారీ మొత్తంలో నియామక చేపట్టనున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top