ఎయిరిండియా చెంతకు రెండు ఎయిర్‌లైన్స్‌! | Tatas mulling options to group AirAsia, Vistara under Air India | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా చెంతకు రెండు ఎయిర్‌లైన్స్‌!

Sep 22 2022 4:21 AM | Updated on Sep 22 2022 4:21 AM

Tatas mulling options to group AirAsia, Vistara under Air India - Sakshi

ముంబై: విమాన సర్వీసుల వ్యాపార విభాగాన్ని కన్సాలిడేట్‌ చేయడంపై టాటా గ్రూప్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియా కిందికి ఎయిర్‌ఏషియా ఇండియా, విస్తారలను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆపరేషన్స్‌ విభాగం డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ సంధూ సారథ్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించాయి.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ఏషియా ఇండియా అలాగే ఎయిరిండియా, విస్తార కార్యకలాపాల మధ్య సారూప్యతలను ఈ టీమ్‌ మదింపు చేయనున్నట్లు తెలిపాయి. ఏడాది వ్యవధిలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్‌ఏషియా ఇండియాను కన్సాలిడేట్‌ చేయాలని, 2024 నాటికి మొత్తం విమాన సేవల వ్యాపారాన్ని ఎయిరిండియా గొడుగు కిందికి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement