టాటా స్టీల్‌ సరికొత్త రికార్డ్‌లు | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్‌ సరికొత్త రికార్డ్‌లు

Published Sun, Apr 7 2024 10:01 PM

Tata Steel India Sales Rises 6 Percent To 20 Mn Tonnes - Sakshi

స్టీల్‌ ఉత్పత్తుల్లో టాటా స్టీల్‌ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్‌కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది.

ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్‌ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్‌ వెల్లడించింది. 

ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2024లో  2.9 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023  మునుపటి రికార్డును అధిగమించింది.  

బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్‌ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

Advertisement
 
Advertisement