టాటా న్యూ యాప్ సూపర్ సక్సెస్! అందుకు ఇదే నిదర్శనం!

Tata Neu app launch Highlights - Sakshi

టాటా గ్రూప్‌ ఇటీవల ఆవిష్కరించిన సూపర్‌ యాప్‌ ’న్యూ’లో ఇతర బ్రాండ్లకు కూడా చోటు లభించనుంది. గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్‌ 7న ఆవిష్కరించిన న్యూ యాప్‌నకు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌ జియో మార్ట్‌ సంస్థలతో పోటీగా ఈ నెల 7న లాంచ్ చేసిన ఈ  టాటా న్యూయాప్‌ను 48 గంటల్లోనే 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ నమోదు చేసుకున్నట్లు తెలిపారు.   

ఓపెన్‌ ఆర్కిటెక్చర్‌ విధానంలో రూపొందించిన ఈ యాప్‌లో టాటాయేతర గ్రూప్‌ కంపెనీల ఉత్పత్తులు, సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని చంద్రశేఖరన్‌ వివరించారు. నిత్యావసరాల నుంచి విమాన టికెట్ల బుకింగ్‌ వరకూ అన్ని రకాల ఉత్పత్తులు, సర్వీసులను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు టాటా గ్రూప్‌ ’న్యూ’ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌ఏసియా, బిగ్‌బాస్కెట్, క్రోమా మొదలైన బ్రాండ్స్‌ ఇప్పటికే ఇందులో లభిస్తుండగా..త్వరలో విస్తారా, ఎయిరిండియా, టైటాన్, టాటా మోటార్స్‌ మొదలైనవి కూడా అందుబాటులోకి రానున్నాయి.  

చదవండి: 'టాటా న్యూ యాప్‌ లాంచ్‌, రతన్‌ టాటా మాస్టర్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top