టాటా కామ్‌- ఫెడరల్‌ బ్యాంక్‌ జోరు

Tata communications- Federal bank jumps on Q2 results - Sakshi

400 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌

క్యూ2 ఫలితాల ఎఫెక్ట్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు టాటా కమ్యూనికేషన్స్‌

మెరుగుపడ్డ రుణాల నాణ్యత, మొండి బకాయిలు

5 శాతం జంప్‌చేసిన ఫెడరల్‌ బ్యాంక్‌

హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 424 పాయింట్లు జంప్‌చేసి 40,407ను తాకింది. నిఫ్టీ 105పాయింట్లు ఎగసి 11,867 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో అటు టాటా కమ్యూనికేషన్స్‌, ఇటు.. ఫెడరల్‌ బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

టాటా కమ్యూనికేషన్స్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ టాటా కమ్యూనికేషన్స్‌ రూ. 385 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 7 రెట్లు అధికంకాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 4,282 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టాటా కామ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 919 ఎగువన ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 935కు చేరువైంది.

ఫెడరల్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో రూ. 308 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 26 శాతం క్షీణతకాగా.. ప్రొవిజన్లకు అధిక కేటాయింపులు చేపట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ. 1,380 కోట్లకు చేరింది. రుణ మంజూరీ 6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.13 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, తదితరాలు 135 శాతం పెరిగి రూ. 592 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.12 శాతం నీరసించి 2.84 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు 0.23 శాతం మందగించి 0.99 శాతాన్ని తాకాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 55 సమీపంలో ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top