నాలుగేళ్ల జీతం బోనస్‌ బొనాంజా: ఈ బంపర్‌ ఆఫర్‌ ఎక్కడ?

Taipei shipping company offers 4 Years Salary Bonus For Employees - Sakshi

న్యూఢిల్లీ:  తైవాన్‌కు చెందిన కంపెనీ తన ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్‌ ప్రకటించింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా  నాలుగేళ్ల  జీతాన్ని  బోనస్‌ ప్రకటించింది తన సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2021లో చెల్లించిన 40 నెలల బోనస్‌తో పోలిస్తే తాజాగా తన రికార్డ్‌ను తనే అధిగమించింది.  గతంలో అత్యధిక సంవత్సరాంత బోనస్‌ అందించిన సంస్థగా  ఇది  రికార్డు సృష్టించింది.

తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్‌లను 50 నెలల జీతం,సగటున నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతం అందించిందట. ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ తన సిబ్బందిలో కొంతమందికి  అద్భుతమైన  న్యూ ఇయర్‌ కానుక అందించింది. సంవత్సరాంతపు బోనస్‌లు ఎప్పుడూ కంపెనీ పనితీరు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుపై ఆధారపడి ఉంటాయని ప్రకటించిన ఎవర్‌గ్రీన్ మెరైన్  ఇతర వివరాలను అందించడానికి నిరాకరించింది.

అయితే కంపెనీకి చెందిన చాలామంది ఉద్యోగులను ఈ అదృష్టం వరించలేదు. దీంతో షాంఘైకి చెందిన ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ నెలవారీ జీతాల కంటే ఐదు-ఎనిమిది రెట్లు మాత్రమే బోనస్‌ ప్రకటించడం అన్యాయమని వారు ఆరోపించారని స్థానిక  మీడియా నివేదించింది. కాగా గత రెండేళ్లలో ఈ కంపెనీ వ్యాపారం బాగా పెరిగింది.  కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ల తర్వాత గ్లోబల్ కంటైనర్ షిప్పింగ్ లైన్‌లు పుంజుకోవడం, అలాగే షిప్పింగ్ ధరలు పెరగడంతో 2022లో  పోలిస్తే, మూడు రెట్లు ఎక్కువగా సంస్థ ఆదాయం 20.7 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top