ర్యాపిడోలో స్విగ్గీ రైడ్‌

Swiggy Huge Amount Invested In Rapido Bike Services - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బైక్‌ ట్యాక్సీ వేదిక అయిన ర్యాపిడో తాజాగా రూ.1,370 కోట్ల నిధులను సమీకరించింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్, డెలివరీ సేవల్లో ఉన్న స్విగ్గీ పెట్టుబడి పెట్టడం విశేషం. సిరీస్‌–డి ఫండింగ్‌లో భాగంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీతోపాటు ఇప్పటికే ఈ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసిన వెస్ట్‌బ్రిడ్జ్, షెల్‌ వెంచర్స్, నెక్సస్‌ వెంచర్స్‌ సైతం తాజా రౌండ్‌లో నిధులను సమకూర్చాయి. సాంకేతికత మెరుగు, సిబ్బంది సంఖ్యను పెంచుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చించ్చనున్నట్టు ర్యాపిడో తెలిపింది.

100కుపైగా నగరాల్లో డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌ ఆదాయాలు పెరిగేందుకు, కస్టమర్ల అనుభూతి మెరుగుపర్చడానికి బైక్‌ ట్యాక్సీ, ఆటో, డెలివరీ విభాగాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు ర్యాపిడో రూ.990 కోట్లు సమీకరించింది. 100కుపైగా నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. 2.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 15 లక్షల మంది డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌తో చేతులు కలిపింది. 

చదవండి: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం.. కేవైసీ ఇవ్వాలి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top