సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!

Suzuki jimny heritage edition details - Sakshi

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి జిమ్నీ ఇటీవల ఆస్ట్రేలియన్ మార్కెట్లో 'జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కావున కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.

సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ ధర 33,490 AUD (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 18 లక్షలు). ఇది కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే విక్రయించడానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఆఫ్ రోడర్స్ మనసు దోచిన ఈ మోడల్ మరింత ఆదరణ పొందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

కొత్త జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ ట్రైన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. పర్ఫామెన్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

(ఇదీ చదవండి: Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ)

సుజుకి జిమ్నీస్పెషల్ హెరిటేజ్ ఎడిషన్‌ బ్లాక్ పెర్ల్,జంగిల్ గ్రీన్, వైట్, మీడియం గ్రే కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సిన అంశం దాని డిజైన్. ఈ ఆఫ్ రోడర్ కొత్త డీకాల్స్, రెడ్ కలర్స్‌లో ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌ఫ్లాప్‌లతో చూడచక్కగా ఉంటుంది. ఇది 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ అనే అక్షరాలు సైడ్ ప్రొఫైల్‌లో చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా టాప్-స్పెక్ జిమ్నీ మాదిరిగానే 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, లెదర్ చుట్టబడిన స్టీరింగ్ వీల్, నావిగేషన్, క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి లభిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. దీనిపైన కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top