Sakshi News home page

ఊ అంటావా స్పైస్‌ జెట్‌ ? ఊహూ అంటావా?

Published Fri, Jan 28 2022 7:54 PM

Supreme Court Warned SpiceJet On Credit suisse case  - Sakshi

అప్పుల భారంతో కిందామీదా అవుతోన్న స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. క్రెడిట్‌ సూసీ దాఖలు చేసిన కేసులో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన దివాళా తీర్పును సవాల్‌ చేస్తూ స్పైస్‌జెట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాలు విన్న న్యాయస్థానం డూ ఆర్‌ డై అంటూ స్పైస్‌ జెట్‌కి వార్నింగ్‌ ఇచ్చింది.

స్పైస్‌జెట్‌ ఎయిర్‌వేస్‌కి స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిస్‌ సూసీ సంస్థల మధ్య పలు దఫాలుగా 2011 నవంబరు నుంచి 2012 సెప్టెంబరు మధ్య ఒప్పందాలు కుదిరాయి. దీని ప్రకారం స్పైస్‌జెట్‌ ఆధీనంలో ఉన్న విమానాల మెయింటనెన్స్‌, రిపేరింగ్‌, ఓవర్‌హాలింగ్‌ తదితర పనులు పదేళ్ల కాలానికి క్రెడిస్‌ సూసీ సంస్థ చేపడుతుంది. ఒప్పందం ప్రకారం స్పైస్‌జెట్‌ సంస్థకి క్రెడిట్‌ సూసీ సర్వీసులు అందించింది.

నిర్వాహాణ లోపాల కారణంగా నష్టాలు ఎదురవడంతో స్పైస్‌జెట్‌ సంస్థ మూతపడింది. అయితే మెయింటనెన్స్‌ ఇతర పనులకు సంబంధించి క్రెడిట్‌ సూసీ సంస్థకు ఇవ్వాల్సిన 26 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని చెల్లించలేదు. దీనిపై ‍క్రెడిట్‌ సూసీ సంస్థ చట్ట ప్రకారం నోటీసులు పంపి చివరకు  మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ  స్పైస్‌జెట్‌ను దివాళాగా ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. మద్రాసు కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం తలుపు తట్టింది స్పైస్‌జెట్‌.

శుక్రవారం సుప్రీం కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు స్పైస్‌జెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు సంస్థను నిర్వహించాలని అనుకుంటున్నారా ? లేదా అంటూ సూటీగా ప్రశ్నించింది. బకాయిలు చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? మీ ఆర్థిక పరిస్థితి ఏంటనే వివరాలు ఎందుకు స్పష్టం చేయడం లేదంటూ ప్రశ్నించింది. సంస్థను నిర్వహించే తీరు ఇదేనా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీరు సరైన సమాధానం ఇవ్వకుంటే ఇన్‌సాల్వెన్సీగా కంపెనీగా పరిగణించి ఆస్తులు వేలం వేయాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. చివరకు ఈ వివాదం పరిష్కరించుకునేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలంటూ స్పైస్‌జెట్‌ న్యాయవాదులు కోరడంతో సుప్రీం అందుకు అంగీకరించింది.  

చదవండి:శంషాబాద్‌లో స్పైస్‌జెట్‌ అత్యవసర ల్యాండింగ్‌

Advertisement
Advertisement