ఎయిటెల్‌ బాస్‌ సునీల్‌ మిట్టల్‌కు నైట్ హుడ్‌ అవార్డ్‌!

Sunil Bharti Mittal Get Honorary Knighthood From King Charles III - Sakshi

భారతీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ అరుదైన ఘనతను సాధించారు. భారత్‌-యూకేల మధ్య స్నేహపూర్వక వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నందుకు గాను కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యంత ప్రతిష్మాత్మక నైట్ హుడ్‌ అవార్డ్‌ను పొందారు. 

కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE) పేరుతో బ్రిటన్‌ ప్రభుత్వం అందించే అవార్డ్‌లలో ఇది ఒకటి. ఈ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్‌ పేరు  సంపాదించారు.  

ఈ సందర్భంగా మిట్టల్‌ మాట్లాడుతూ “కింగ్ చార్లెస్ నుండి అరుదైన పురస్కారం పొందడంపై సంతోషంగా ఉంది. యూకే-భారత్‌లు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్‌-యూకేల మధ్య ఆర్థిక  ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని మిట్టల్ అన్నారు. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top