
యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి సంస్థలు ప్రకటించిన జూన్ త్రైమాసికం (Q1FY26) ఫలితాలకు ఇన్వెస్టర్లు స్పందించడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత్‌పై అమెరికా 10-15 శాతం సుంకం విధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఉదయం 9.34 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 161.82 (0.20%) పాయింట్లు క్షీణించి 82,097.4 వద్ద, నిఫ్టీ 50 36.85 (0.15%) పాయింట్లు క్షీణించి 25,099 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టపోయాయి.
నేటి క్యూ1 ఫలితాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ జింక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎల్టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, అతుల్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఇండియామార్ట్ ఇంటర్మేష్, మాస్టెక్, ఎంపీఎస్, ఆర్తి డ్రగ్స్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, శివ సిమెంట్, కేరళ ఆయుర్వేద, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్, అసోసియేటెడ్ స్టోన్ ఇండస్ట్రీస్ (కోటా) తదితర కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి.