
దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు ఎగబాకి 21,905కు చేరింది. సెన్సెక్స్ 123 పాయింట్లు పుంజుకుని 72,201వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజ సంస్థ అయిన మెటా ఒక్కరోజులోనే 20 శాతం పెరిగింది. జనవరిలో యూఎస్ ఎకానమీలో 3,53,000 కొత్త ఉద్యోగాలు వచ్చి చేరినట్లు జాబ్స్‌డేటా ద్వారా తెలిసింది. కానీ మార్కెట్లు ఈ డేటా 1,77,000 వస్తుందని భావించింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.96 వద్ద ట్రేడవుతోంది. 10 ఏళ్ల వ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 4.05శాతానికి చేరాయి. క్రూడాయిల్ ధర 0.67 శాతం పెరిగి 77.85 అమెరికన్ డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్ విలువ 0.47శాతం పడిపోయింది.
శుక్రవారం మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు రూ.70.69 కోట్లు, డీఐఐలు రూ.2463.16 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రకారం రైల్వేలు 2శాతం, రోడ్లు 3శాతం, పట్టణ గృహనిర్మాణ రంగం 3శాతం, రక్షణ రంగం 9శాతం మూలధన వ్యయాన్ని పెంచుకోనున్నాయని అంచనా.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment