Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Published Fri, Jan 19 2024 9:12 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్‌ 580  పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది.

ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్‌ ఇండెక్స్‌ 103.38కు చేరింది. బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్‌లోని నాస్‌డాక్‌ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్‌ బాండ్‌ ఈల్డ్‌లు 3 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్‌ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. 

పాకిస్థాన్‌ ఇరాన్‌ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్‌ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్‌ కొరియా, సౌత్‌ కొరియా మధ్య సంబంధాలపై కొమ్‌జాంగ్‌ఉన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్‌ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్‌ల్ల పరీక్ష, లైఫ్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌లను చేయబోతున్నట్లు తెలిపారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) 

Advertisement

What’s your opinion

Advertisement