సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌ సూచీలు

Mar 4 2024 3:33 PM | Updated on Mar 4 2024 3:38 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌ స్టాక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్‌లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement