భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 17th December 2024 | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Dec 17 2024 3:48 PM | Updated on Dec 17 2024 4:03 PM

Stock Market Closing Update 17th December 2024

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.

సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement