మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు లేదా 1.54 శాతం లాభంతో 73,033.78 వద్ద, నిఫ్టీ 358.60 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 22,721.95 వద్ద నిలిచాయి.
బంధన్ బ్యాంక్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్‌బిఎల్ బ్యాంక్ లిమిటెడ్, ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆర్ఆర్ కేబుల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


