తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ముందుగా గజాలు, అశ్వాలు నడుస్తుండగా, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ కన్నులపండువగా సాగింది. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.


