కుప్పకూలిన మార్కెట్‌ : సూచీలు ఢమాల్‌

stock market big fall,  1000 points down   - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.  శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్లు  కుప్పకూలింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. బ్యాంక్‌, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇలా అన్ని రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో దేశీయ మార్కెట్లో గత రెండు రోజులు తుడిచిపెట్టుకు పోయాయి.  యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ ఏడాది గరిష్టానికి చేరడం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. అయితే ఆరంభం పతనాన్ని నుంచి కోలుకున్న సెన్సెక్స్‌  ప్రస్తుతం 676 పాయింట్ల నష్టంతో 50396 వద్ద, నిఫ్టీ 179  పాయింట్ల నష్టంతో 14914 వద్ద ట్రేడవుతోన్నాయి. 

వాల్ స్ట్రీట్  ప్రధాన సూచికలు గురువారం కుప్పకూలిపోయాయి, నాస్డాక్ సూచిక నాలుగు నెలల్లో అతిపెద్ద  పతనాన్ని నమోదు చేసింది. జనవరి 28 నుండి అతిపెద్ద ఇంట్రాడే శాతం నష్టానికి దారితీసింది. జపాన్ 225 1.8 శాతం క్షీణించగా, హాంకాంగ్, హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 1.69 శాతం నష్టపోయాయి. మరోవైపు ఎన్ఎస్ఓ మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 2020-21 మార్కెట్ ముగిసిన నేడు  స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను విడుదల చేయనుంది. వరుసగా రెండు త్రైమాసికాల సంకోచం తరువాత అక్టోబర్-డిసెంబర్ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top