నష్టాల్లో స్పెన్సర్స్‌.. ఈ ఏడాది ఎంతంటే?

Spencers Retail Q4 Results - Sakshi

న్యూఢిల్లీ: ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు సంస్థ స్పెన్సర్స్‌ రిటైల్‌ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.42 కోట్ల నష్టాన్ని ఈ సంస్థ మూటగట్టుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.34.53 కోట్లతో పోలిస్తే మరింత పెరిగినట్టు తెలుస్తోంది.

ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి స్పెన్సర్స్‌ రిటైల్‌ కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.121 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.164 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం 5 శాతం తగ్గి రూ.2,300 కోట్లకు పరిమితమైంది. విక్రయాల్లో వృద్ధి, వ్యయాల నియంత్రణ, నెట్‌వర్క్‌ విస్తరణపై తమ దృష్టి కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది.   

చదవండి: మెప్పించని ఎల్‌అండ్‌టీ....

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top