అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా? | South Korea 5G Network Speed Reaches 691Mbps Per Second | Sakshi
Sakshi News home page

అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?

Jan 3 2021 3:24 PM | Updated on Jan 3 2021 4:21 PM

South Korea 5G Network Speed Reaches 691Mbps Per Second - Sakshi

సియోల్: ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5జీ వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. తాజాగా తెలిసిన నివేదికల ప్రకారం అక్కడ 5జీ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2020 రెండో అర్ధ భాగంలో ఎస్కె టెలికాం, కెటి కార్ప్, ఎల్జి అప్లస్ కార్ప్ నెట్‌వర్క్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్ గా ఉంది. అదే తొలి ఆరు నెలల కాలంలో డౌన్‌లోడ్ వేగం 33.91 ఎంబీపీఎస్​గా నమోదవగా.. ఆ వేగం ఇప్పుడు ఇరవై రెట్లకు పైగా పెరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్​, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి.(చదవండి: 5జీ మొబైల్స్‌ సందడి షురూ

ఆ దేశంలోని మూడు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ లైన ఎస్కె టెలికాం 5జీ ఇంటర్ నెట్ డౌన్‌లోడ్ వేగం 795.57 ఎమ్‌బిపిఎస్, కెటి 667.48 ఎమ్‌బిపిఎస్, ఎల్‌జి అప్లస్ 608.49 ఎమ్‌బిపిఎస్ వద్ద ఉన్నాయి. అలాగే ఆ దేశంలో 4జీ ఎల్‌టిఇ డౌన్‌లోడ్ వేగం 153.1 ఎమ్‌బిపిఎస్‌గా ఉంది. 4జీ ఎల్‌టిఇ వేగం కంటే 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే 5జీని మొట్టమొదటి సారిగా కమర్షయలైజ్ చేసిన దేశం దక్షిణ కొరియానే. అలాగే అక్టోబర్ చివరి నాటికి దాదాపు 10 మిలియన్ల 5జీ యూజర్ నెట్ వర్క్ ను త్వరగా నిర్మించింది. దక్షిణ కొరియా దేశంలోని మొత్తం 70 మిలియన్ల మొబైల్ చందాదారుల వాటాలో 14 శాతం 5జీ చందాదారులే.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్‌ ఇదే..!)

అయితే, మొదట్లో సాంకేతిక లోపం, లిమిటెడ్ కవరేజ్, క్వాలిటీ సమస్యలు, తక్కువ ఇంటర్ నెట్ స్పీడ్ 4జీ కంటే తక్కువగా ఉండటంతో మొదట్లో వినియోగదారులు ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే ఈ సమస్యలన్నింటిని అక్కడి ప్రభుత్వ సహాయంతో టెలికాం నెట్ వర్క్ లు పరిష్కారించాయి. దింతో అక్కడి 5జీ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. 2022 నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని 
అందించాలని లక్ష్యంగా దక్షిణ కొరియా పెట్టుకుంది. దీనికోసం అక్కడి ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్​వర్క్ కోసం 25.7ట్రిలియన్​ (24 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. భారత్​లో కూడా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్​వర్క్​ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement