భారీ అమ్మకాలతో ఈ చిన్న షేర్లు బోర్లా | Small cap shares plunges with volumes | Sakshi
Sakshi News home page

భారీ అమ్మకాలతో ఈ చిన్న షేర్లు బోర్లా

Jul 31 2020 3:08 PM | Updated on Jul 31 2020 3:08 PM

Small cap shares plunges with volumes - Sakshi

ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని స్టాల్ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. దీంతో నేషనల్ ఫెర్టిలైజర్స్‌, టీపీఎల్‌ ప్లాస్టెక్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, శాంతి గేర్స్‌, రినైసెన్స్‌ గ్లోబల్‌ భారీ నష్టాలతో కుప్పకూలాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం..

నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతంపైగా కుప్పకూలి రూ. 36 దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4.19 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 6.71 లక్షల షేర్లు చేతులు మారాయి.

టీపీఎల్‌ ప్లాస్టెక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దిగజారి రూ. 117 దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 13,000 షేర్లు చేతులు మారాయి.

ఐబీ వెంచర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం పతనమై రూ. 35 దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 72,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 57,000 షేర్లు చేతులు మారాయి.

శాంతి గేర్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం పడిపోయి రూ. 85 దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,200 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 18,000 షేర్లు చేతులు మారాయి.

రినైసెన్స్‌ గ్లోబల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం తిరోగమించి రూ. 269 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 750 షేర్లు మాత్రమేకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 6,800 షేర్లు చేతులు మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement