మార్కెట్‌కు బడ్జెట్‌ బూస్ట్‌, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్‌!

Sensex zooms1200 cigarette duty hike these stocks falls  - Sakshi

సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్‌ స్టాక్‌మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి.  టాక్స్‌ షాక్‌ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి.  

ముఖ్యంగా  కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్‌తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం  నష్టపోయిన ఐటీసీ షేర్లు  తేరుకొన్నాయి. ఇంకా ఎన్‌టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్‌టి ఇండస్ట్రీస్ 0.35 శాతం  నష్టాలతో కొనాసగుతున్నాయి. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు.  వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని,  గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్‌   స్టాక్‌లకు  జోష్‌నిస్తుందని  స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top