స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex Snaps 3 Day Losing Run, up 187 pts, Nifty above 17250 | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Feb 8 2022 4:20 PM | Updated on Feb 8 2022 4:21 PM

Sensex Snaps 3 Day Losing Run, up 187 pts, Nifty above 17250 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఆర్​బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష సమావేశంలో రేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు, అంతర్జాతీయ కారణాలతో 11 గంటల సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం పలు రంగాల షేర్లు కోలుకోవడం వల్ల.. మార్కెట్లు పుంజుకున్నాయి. చివరకు, సెన్సెక్స్ 187.39 పాయింట్లు (0.33%) పెరిగి 57,808.58 వద్ద నిలిస్తే, నిఫ్టీ 53.20 పాయింట్లు(0.31%) లాభపడి 17,266.80 వద్ద స్థిర పడింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.73 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్ అత్యధికంగా 3 శాతానికి పైగా వృద్ధి సాధించింది. బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్​సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి షేర్లు రాణిస్తే.. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మెటల్, ఫార్మా, పిఎస్‌‌‌‌‌‌‌‌యు బ్యాంక్ మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 0.45-1.4 శాతం పడిపోయాయి.

(చదవండి: స్మార్ట్ ప్రోటీన్ రంగంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెట్టుబడులు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement