నష్టాల్లో ఆటో స్టాక్స్‌, ఊగిసలాటలో సూచీలు

Sensex rebounds into gains and Nifty Trades above 16500 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మర్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సూచనల సెన్సెక్స్‌ 62 పాయింట్ల నష్టంతో 55319 వద్ద,  నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 16492 వద్ద  ట్రేడ్‌ అయింది. ప్రస్తుతం లాభాలతో  కొనసాగుతోంది. వరుసగా  రెండో రోజు కూడా  వోలటాలిటీ ధోరణి కనిపిస్తోంది.  దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా ఎఫ్‌ఎంసిజి, ఆటో వరుసగా 1.17 ,0.76 శాతం వరకు పతనమైనాయి. హీరో మోటోకార్ప్ 3.27 శాతం మేర నష్టపోతుండగా, ఒఎన్‌జిసి, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్, పవర్‌గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్  ఇతర లూజర్స్‌గా ఉన్నాయి

మరోవైపు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top