Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Sensex Plunges 509 Points Ahead Of Retail Inflation Data - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 509 పాయింట్లు కుప్ప​కూలి 53887 వద్ద నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 16058 వద్ద స్థిరపడ్డాయి.  ఫలితంగా సెన్సెక్స్‌ 54 వేల  స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 16100 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, పలు చైనా నగరాల్లో కోవిడ్-19 షట్‌డౌన్ల కారణంగా ఆసియాలో  మార్కెట్ల  బలహీనత నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. 

ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్స్‌, భారతి ఎయిర్టెల్‌, అదానీపోర్ట్స్‌, కోల్‌ ఇండియా టాప్‌ విన్నర్స్‌గాను, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, నెస్లే టాప్‌ లూజర్స్‌గాను నిలిచాయి. మరోవైపు డాలరు మారంలో రూపీ మంగళవారం మరింత దిగజారింది. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు : సెన్సెక్స్‌ 509,నిఫ్టీ 158 పాయింట్లు పతనం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top