బేర్ దెబ్బకు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Sensex Plunges 1023 Points, Nifty Ends Near 17200 Points - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు గంట గంటకు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమరు ధరలు భారీగా పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ఎఫ్ఐఐ అమ్మకాల వెల్లువ వంటి కారణాల చేత సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజులుగా వెలువడుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో దేశీ సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,023.63 పాయింట్లు లేదా 1.75% క్షీణించి 57,621.19 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 302.70 పాయింట్లు లేదా 1.73% క్షీణించి 17,213.60 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో పోలిస్తే  రూపాయి మారకం విలువ రూ.74.71 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్ & టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోతే..  పవర్ గ్రిడ్ కార్ప్, ఒఎన్‌జిసీ, ఎన్‌టిపీసీ, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్ షేర్లు అధిక లాభాలను పొందాయి. పిఎస్‌యు బ్యాంకు, మెటల్ & పవర్ మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంక్, హెల్త్ కేర్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ 1-2 శాతంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75-1.25 శాతం పడిపోయాయి.

(చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top