
ఆరంభ నష్టాల నుంచిబౌన్స్ బ్యాక్ అయిన స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. 300 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ మిడ్‌సెషన్‌నుంచి పుంజుకుని 170 పాయింట్లు ఎగిసింది.
సాక్షి, ముంబై: 300 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ మిడ్‌సెషన్‌నుంచి పుంజుకుని 170 పాయింట్లు ఎగిసింది. 47675 వద్ద కొనాగుతోంది. నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 14366 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రధానంగా షార్ట్ కవరింగ్ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఆటో, కేపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజజీ రంగాలు స్వల్ప నష్టాల్లో, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ లాభపడుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ విప్రో టాప్ విన్నర్స్‌గా ఉండగా, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటన్, శ్రీ సిమెంట్స్ నష్టపోతున్నాయి.