వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

Sensex Gains 366 pts, Nifty Above 17200 Led By Auto, Financials - Sakshi

ముంబై: గత కొద్ది రోజుల నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్​ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ఫలితాలు, ఆటో, పవర్ & బ్యాంకింగ్  షేర్లు బలపడటం మార్కెట్లకు కలిసి వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి స్టాక్ కంపెనీల ధరలు భారీగా పడిపోవడంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ముగింపులో, సెన్సెక్స్ 366.64 పాయింట్లు (0.64%) పెరిగి 57,858.15 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.90 పాయింట్లు (0.75%) లాభపడి 17,278.00 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద ఉంది. అత్యధికంగా యాక్సిస్​ బ్యాంకు షేర్లు 7 శాతానికిపైగా లాభపడ్డాయి. మారుతి 6.5శాతం వృద్ధి చెందింది. ఎస్​బీఐఎన్, ఇండస్​ఇండ్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు లాభాలను ఆర్జించాయి. హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్​, విప్రో, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, విద్యుత్, ఆటో బ్యాంకు 2-4 శాతం పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు 0.8-1 శాతం లాభపడ్డాయి.

(చదవండి: కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top