బ్లూచిప్‌ షేర్ల దన్ను

Sensex gains 185 points on strong macroeconomic data and nifty 11500 points - Sakshi
చివర్లో లాభాలు సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు రూపాయి పతనమైనా ముందుకే మార్కెట్‌ 185 పాయింట్ల లాభంతో 39,086కు సెన్సెక్స్‌ 65 పాయింట్లు పెరిగి 11,535కు నిఫ్టీ

ట్రేడింగ్‌ చివర్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వివిధ దేశాల తయారీ రంగ గణాంకాలు ఆర్థిక ‘రికవరీ’ సంకేతాలిస్తుండటం, అమెరికా అదనంగా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు కలసివచ్చాయి. అయితే  చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలకు కళ్లెం పడింది. సెన్సెక్స్‌  185 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి.   అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు  క్షీణించి  73.03 వద్దకు చేరింది.  

5 సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి...
సెనెక్స్‌ నష్టాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టాల్లోంచి ఐదుసార్లు లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 165 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 245 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 406 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ఒడుదుడుకులు చోటు చేసుకుంటున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 5.7 శాతం లాభంతో రూ. 642.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.
సూచిస్తున్నారు.  
► రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2 శాతం లాభంతోరూ. 2,128 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ మొత్తం లాభాల్లో ఈ షేర్‌ వాటాయే మూడింట రెండు వంతులు ఉండటం విశేషం. సెన్సెక్స్‌ మొత్తం 185 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ వాటాయే 120 పాయింట్ల మేర ఉంది.   
సూచిస్తున్నారు.  
► జీ ప్లెక్స్‌ పేరుతో సినిమా–టు–హోమ్‌ సర్వీస్‌ను  అందించనుండటంతో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర 8 శాతం వృద్ధితో రూ.217 వద్ద ముగిసింది.  
సూచిస్తున్నారు.  
► ఆగస్టులో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు లాభపడ్డాయి.  
సూచిస్తున్నారు.  
► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీఎస్‌టీ టిల్లర్స్, అదానీ గ్రీన్, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
సూచిస్తున్నారు.  
► నిధుల సమీకరణ వార్తల కారణంగా వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 11 శాతం లాభంతో రూ.9.91కు చేరింది.  
సూచిస్తున్నారు.  
► ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లతో సహా మొత్తం 300కు పైగా షేర్లు  లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. మరోవైపు 256 షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top