ఆరంభ లాభాలు ఆవిరి: రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ దూకుడు

సాక్షి, ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్ లాభాలతోభారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభపడ్డాయి. బుధవారం మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నిఫ్టీ 79 పాయింట్లు ఎగిసి 16,200 పైన ట్రేడ్ అయింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ వృద్ధి ఆందోళనలు బలహీన అమెరికా ఆర్థిక డేటా ప్రభావంతో ఆరంభ లాభాలను కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 17పాయింట్లు పరిమిత లాభంతో కొనసాగుతున్నాయి.
SBI లైఫ్ 2.64 శాతం ఎగిసి టాప్ గెయినర్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎన్‌టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్న్నా భారీ లాభాలతో ఉన్నాయి. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్‌బిఐ, ఎన్‌టిపిసి లాభపడుతుండగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాజిటివ్ నోట్‌తో ఉంది.
మరోవైపు ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.