Srock Market: రోజంతా ఒడిదుడుకులు: స్వల్ప నష్టాలకు పరిమితం

sensex and nifty ended in Flat note - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌ ఉన్నప్పటికీ ఆ తరువాత కొనుగోళ్ల సందడి నెలకొంది. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి. అయితే  కీలక మద్దతు స్థాయిలకుపైన ముగియడం విశేషం.   సెన్సెక్స్‌   8 పాయింట్ల స్పల్ప నష్టంతో 53018 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల  నష్టంతో 15780 వద్ద పటిష్టంగా ముగిసాయి. 

ఆటో, పీఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్ షేర్లు నష్టపోగా, పవర్ , బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, బ్రిటానియా, దివీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.  బజాజ్‌ ఆటో, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top