మైసూర్‌ కాఫీపై సెబీ జరిమానా | SEBI Imposes Rs One Crore Fine On Coffee Day Enterprises | Sakshi
Sakshi News home page

మైసూర్‌ కాఫీపై సెబీ జరిమానా

Published Tue, Mar 28 2023 4:33 AM | Last Updated on Tue, Mar 28 2023 4:33 AM

SEBI Imposes Rs One Crore Fine On Coffee Day Enterprises - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మైసూర్‌ అమాల్గమేటెడ్‌ కాఫీ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌(ఎంఏసీఈఎల్‌)పై రూ. కోటి జరిమానా విధించింది. రూ. 3,535 కోట్ల నిధులను అక్రమ బదిలీ చేసేందుకు ప్రయివేట్‌ రంగ కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(సీడీఈఎల్‌)ను ప్రేరేపించిన కేసులో ఫైన్‌ వేసింది.

45 రోజుల్లోగా జరిమానాను చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఈ రెండు సంస్థలూ దివంగత వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబ సభ్యుల అజమాయిషీలో ఉన్న కంపెనీలు కాగా.. సీడీఈఎల్‌ అనుబంధ సంస్థల నుంచి నిధుల అక్రమ బదిలీకి ఎంఏసీఈఎల్‌ సహకరించినట్లు సెబీ పేర్కొంది. తద్వారా సెబీ చట్టం, పీఎఫ్‌యూటీపీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement