SBI Increases interest Rates on Fixed Deposits - Sakshi
Sakshi News home page

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్‌బీఐ!

Dec 17 2021 2:53 PM | Updated on Dec 17 2021 5:31 PM

SBI Increases interest Rates on Fixed Deposits - Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి శుభవార్త.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) పెంచినట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు:

డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని నిర్వహించిన వారం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రస్తుతం వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును ప్రస్తుతానికి మార్చకుండా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు, ఇది గత 20 సంవత్సరాలలో కనిష్టం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement