జూలై ఒకటి నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్!

SBI ATM Cash Withdrawal, Cheque Book Charges To Change From 1st July - Sakshi

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. 

జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్‌ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్‌టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు.

చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top