ఆండ్రాయిడ్‌కు శాంసంగ్‌ గుడ్‌బై.. ఇక ఆ వెర్షన్‌తో మొబైల్స్‌!

Samsung Will Say Goodbye To Android Os - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ ఆండ్రాయిడ్‌కు గుడ్‌బై చెప్పనుందా?. వేరే ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మొబైల్స్‌ తీసుకురానుందా?. అవునని చెబుతూ పలు టెక్‌  బ్లాగులు కథనాలు వెలువరుస్తున్నాయి.   

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ తీసేసి ‘ఫుచ్సియా’ (Fuchsia) అని పిలిచే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా మొబైల్స్‌ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఫుచ్సియా కూడా గూగుల్‌ డెవలప్‌ చేసిన ఆపరేటింగ్‌ సిస్టమే కావడం. ఇది ఓపెన్‌ సోర్స్‌ ఓఎస్‌.. అంటే గూగుల్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌లాగా మొబైల్‌ తయారీదారుల నుంచి ఛార్జ్‌లు వసూలు చేయదు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, ఐఓటీ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ప్లేస్‌లో ఫుచ్చియా వెర్షన్‌ ను అప్‌డేట్‌ చేయనుందని పలు టెక్‌ బ్లాగ్‌లు కథనాలు ఇస్తున్నాయి. అయితే..

ఇదంతా సులభం కాదని, అలా కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ చేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని మరికొన్ని రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి. టెక్‌ మార్కెట్‌లో ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమెషిన్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, అగుమెంటడ్‌ రియాలిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఇంట్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ వంటి కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆయా టెక్నాలజీలకు కనెక్ట్‌ అయ్యే విధంగా ప్రముఖ సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ యూజర్లు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ నుండి ఫుచ్సియా వైపు అడుగులు వేస్తోంది. కానీ, ఇది శాంసంగ్ ఆలోచన కాదని, దీని వెనుక మాస్టర్‌ మైండ్‌ గూగుల్‌ అనేది మరో ప్రచారం నడుస్తోంది.

అయితే మార్కెట్‌లో కాంపిటీటర్‌ల కంటే ముందుగా ఈ వెర్షన్‌ అప్‌డేట్‌ చేయడం వల్ల శాంసంగ్‌ పైచేయి సాధించొచ్చు.. లేకపోవచ్చు!. కానీ, కొత్త ఓఎస్‌ వల్ల యూజర్లు ఇబ్బంది పడితే శాంసంగ్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అందుకే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసే విషయంలో శాంసంగ్‌ ఆచితూచి అడుగులు వేస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

చదవండి: వెబ్‌ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top