Samsung Galaxy S22: ఐఫోన్‌13 కంటే చిన్నది, అరచేతిలో ఇమిడిపోతుంది

Samsung Galaxy S22 specs leaked - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం శాంసంగ్‌ విడుదల చేయనున్న శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు లీక్‌ అయ్యాయి. అయితే ఈ ఫీచర్లు అచ్చం ఐఫోన్‌ 13తరహాలో ఉండడంతో యూజర్లు ఈ ఫోన్‌ గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. 

యూజర్లను ఆకట్టుకున్న శాంసంగ్‌ కు చెందిన 'టిప్‌స్టర్‌, ఐసీఆ యూనివర్స్‌' ఫోన్‌ తరహాలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 ఆకట్టుకోనుందని ప్రముఖ టెక్‌ రివ్యూవర్‌ (టిప్‌స్టార్‌) యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ ఫోన్‌ ఫీచర్లు..ఐఫోన్‌ 13 ఫీచర్ల మాదిరిగా లెగ్త్‌, విడ్త్‌,థిక్‌ నెస్‌లు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు  3,700ఎంఏహెచ్‌ బ్యాటరీ, టిన్నీ స్టాండర్డ్‌లో ఆండ్రాయిడ్‌ ఫ్లాగ్‌ షిప్‌, పవర్‌ కన్జ్యూమింగ్‌ కు ఫ్లాగ్‌ షిప్‌ ప్రాసెసర్‌, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22 సైజ్‌ ఐఫోన్ 13 కంటే చాలా చిన్నగా ఉంటుందని.. అరచేతిలో ఇమిడిపోతుందని తెలిపారు.  

ఐఫోన్ 13 కంటే గెలాక్సీ ఎస్ 22 పొడవు, వెడల్పు చిన్నగా ఉంటుందని చెప్పిన యోగేష్‌.. ఫోన్‌ సైజ్‌ 146.7 x 71.5 x 7.7 మిల్లీ మీటర్లుగా ఉందని కాబట్టే ఈ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22.. ఐఫోన్‌ 13కంటే చిన్నగా ఉందన్నారు. 6.06-అంగుళాల డిస్‌ప్లేతో గెలాక్సీ ఎస్ 22 ఆండ్రాయిడ్ మార్కెట్‌లో అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలవగా.. చివరిసారిగా శాంసంగ్ 5.8-అంగుళాల స్క్రీన్ సైజు  గెలాక్సీ ఎస్10 ఈ'ని విడుదల చేసింది. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది 5.8-అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన గెలాక్సీ ఎస్ 10 ఇ. అయితే గెలాక్సీ ఎస్ 22 6.06-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

గెలాక్సీ ఎస్ 22+,గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా అందించే ఛార్జింగ్ స్పీడ్‌లతో పోలిస్తే  25వాల్డ్‌ల  ఫాస్ట్ ఛార్జింగ్ తో గెలాక్సీ ఎస్‌ 22 నెమ్మదిగా ఉంది. ఫోన్‌ వీడియో క్వాలిటీకోసం శామ్‌సంగ్ జీఎన్‌1,జీఎన్‌2 కెమెరా సెన్సార్‌లపై స్కిప్పింగ్ ను తో పాటు ఐఎస్‌ఓసెల్‌ జీఎన్‌5 కెమెరా సెన్సార్‌ని వినియోగించుకోవచ్చని టెక్‌ రివ్యూవర్‌  యోగేష్ బ్రార్ తెలిపారు

చదవండి : ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్‌లో విడుదలైన మరో స్మార్ట్‌ ఫోన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top