రష్యాలో సోషల్‌ మీడియా సంస్థ రెడిట్‌కు భారీ షాక్‌!

Russia fines Reddit for first time for not deleting banned content - Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ"  సమాచారం  ఉందనీ,  సంబంధిత  "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్‌కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్‌టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్‌కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్‌ ఇంకా స్పందించలేదు.

వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్‌తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్‌ల జాబితాలో రెడిట్‌ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top