డుగ్గుడుగ్గు బండిపై రాలేనంటున్న పెళ్లి కొడుకు.. ప్రచారంలో ఆర్టీసీ కొత్త పోకడ

RTC Employees Doing Campaign In Social Media To Attract Commuters - Sakshi

ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునేందుకు కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరకు ప్రతీ ఒక్కరు శ్రమిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించమని కోరుతూ రకరకాల పద్దతిలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు.

ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా సమాజాన్ని ఊపేసిన బుల్లెట్టు బండి పాటకి, పెరుగుతున్న పెట్రోలు ధరలకి లింకు పెడుతూ రూపొందించిన మీమ్‌ని వరంగల్‌ 1 డిపో మేనేజర్‌ అకౌంట్‌ నుంచి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

పెట్రోలు రేటు పెరిగిందున డుగ్గుడుగ్గుమని బుల్లెట్ట బండెక్కి రాలేనని, ఆర్టీసీ బస్సులోనే వస్తానని ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమంటూ పెళ్లి కొడుకు చెబుతున్నట్టుగా ఉన్న ఈ మీమ్‌ని క్రేజ్‌ థాట్‌ అంటున్నారు నెటిజన్లు. నవ్వులు పూయిస్తూ ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలను హర్షిస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top