బీఎస్‌ఎన్‌ఎల్‌ను దాటిన జియోఫైబర్‌ | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ను దాటిన జియోఫైబర్‌

Published Thu, Jan 20 2022 2:34 AM

Reliance Jio topples BSNL as largest fixed line broadband provider - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్‌ జియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాణిజ్య పరంగా సేవలు అందుబాటులోకి తెచ్చిన రెండేళ్లలోనే జియోఫైబర్‌ ఈ ఘనతను సాధించింది. ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో రెండు దశాబ్దాలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధిపత్య స్థానంలో కొనసాగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రకారం.. 2021 నవంబర్‌లో 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో తొలి స్థానంలో ఉంది.

అంత క్రితం నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదార్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్‌కు 40.8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2019 నవంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 86.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ సమయంలో భారతి ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 24.1 లక్షలు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 79.9 కోట్లు, నవంబర్‌లో 80.1 కోట్లకు చేరుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement