కస్టమర్లకు ట్రూ 5జీ సేవలు.. రిలయన్స్‌ జియోతో జతకట్టిన షావోమి ఇండియా!

Reliance Jio Partners With Xiaomi India To Enable True 5G Services To Customers - Sakshi

జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే అన్ని షియోమి 5జీ స్మార్ట్‌ఫోన్లు  

దేశంలోని నంబర్ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్ షియోమి ఇండియా, రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. షియోమి, రెడ్ మి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు అంతరాయం లేని ట్రూ 5 జీ కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవడానికి, అంతరాయం లేని వీడియోలను స్ట్రీమ్ చేయడానికి, అధిక రిజల్యూషన్‌ వీడియో కాల్స్ ఆస్వాదించడానికి, వారి పరికరాలలో తక్కువ-లేటెన్సీ గేమింగ్ ఆడటానికి ఈ అనుబంధం వీలు కల్పిస్తుంది. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్‌ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వినియోగదారులు తమ షియోమి, రెడ్ మి స్మార్ట్‌ ఫోన్‌ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చాలి.

రిలయన్స్ జియో ట్రూ 5 జీ ఎస్ఎ నెట్ వర్క్‌ లో సజావుగా పనిచేయడానికి ఎస్ఎ నెట్ వర్క్‌ మ్దదతు ఇచ్చే మోడళ్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందాయి. 5జీ స్టేవలు పొందే పరికరాలలో ఎంఐ 11 అల్ట్రా 5జీ, షియోమి 12ప్రో 5జీ, షియోమి 11ట్రీ ప్రో 5జీ, రెడ్ మి నోట్ 11 ప్రో+ 5జీ, షియోమి 11 లైట్‌ ఎన్‌ 5జీ, రెడ్ మి నోట్ 11టీ 5జీ, రెడ్ మి 11 ప్రైమ్‌ 5జీ, రెడ్ మి నోట్ 10టీ 5జీ, ఎంఐ 11ఎక్స్ 5జీ, ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ, రెడ్ మి కే50ఐ 5జీ, షియోమి 11ఐ 5జీ, షియోమి 11ఐ హైపర్‌ ఛార్జ్‌ 5జీ ఉన్నాయి.

రెడ్ మీ కే50ఐ, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పరీక్షించారు. ప్రస్తుతం షియోమి, రెడ్ మీ నుంచి చాలా 5 జీ ఎనేబుల్‌ అయిన పరికరాలు రిలయన్స్ జియో ట్రూ 5 జీ నెట్ వర్క్‌ తో బాగా పనిచేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి షియోమీ ఇండియా ప్రెసిడెంట్‌ మురళికృష్ణన్‌ మాట్లాడుతూ  “గత రెండేళ్లుగా షియోమి #IndiaReady5G చేయడానికి కట్టుబడి ఉంది. మేము 5 జీ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నాం. మా స్మార్ట్‌ఫోన్లు టాప్‌- ఆఫ్‌- లైన్‌ ఫీచర్లతో ఆక​ర్షణీయమైన 5 జీ అనుభవాన్ని అందిస్తున్నాయన్నారు.

ఈ అనుబంధం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ.., “కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి, తన వినియోగదారుల చేతుల్లోకి అత్యాధునిక ఆవిష్కరణలను తీసుకురావడానికి షియోమి ఎప్పుడూ ముందంజలో ఉందన్నారు. వారితో కలిసి తమ వినియోగదారులకు 5జీ సేవలు అందించడంతో సంతోషంగా ఉందన్నారు.

జియో ట్రూ 5 జీ మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉండడంతో పాటు భారత్‌లో ఏకెైక ట్రూ 5జీ నెట్ వర్క్‌గా నిలిచింది
1. 4జి నెట్ వర్క్‌ పై జీరో డిపెండెన్సీతో అధునాతన 5 జీ నెట్ వర్క్‌ తో 5 జీ ఆర్కిటెక్చర్‌
2. 700 MHz, 3500 MHz , 26 GHz బ్యాండ్ల లో 5జీ స్పెక్ట్రం అతిపెద్ద, అత్యుత్తమ మిశ్రమం
3. క్యారియర్ అగ్రిగేషన్‌ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5 జీ ఫ్రీక్వెన్సీలను ఒకే బలమైన "డేటా హైవే"గా సజావుగా మిళితం చేసే కాయరియర్ అగ్రిగేషన్‌.

చదవండి: Meesho Shopping Survey: ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top