మరో గ్లోబల్‌ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ

Reliance Consumer Products partnership with Sri Lankan Elephant House - Sakshi

శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్‌ను ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కంపెనీ భారత్‌కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్‌తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది.  నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది.

"భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్‌ఎంసీజీ పోర్ట్‌ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు.

ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్‌లను భారత్‌కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్‌ బ్రాండ్‌ ఎలిఫెంట్ హౌస్‌ను భారత్‌లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్‌ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్‌ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్‌ వంటి పానీయాల బ్రాండ్‌లను కలిగి ఉంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top