రియల్‌ మీ నుంచి రెండు స్మార్ట్‌ వాచెస్‌, సేల్స్‌ ప్రారంభం

Realme launched Realme Watch 2 realme watch Pro check details here  - Sakshi

రియల్‌ మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ వాచెస్‌

విడుదల చేసిన రియల్‌ మీ ప్రతినిధులు 

నేటి నుంచే మార్కెట్‌ లో లభ్యం 

లాస్‌ ఎంజెంల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కేంద్రంగా ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్‌ ఆన్‌ లైన్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా రియల్‌ మీ సంస్థ రియల్‌ మీ వాచ్‌ 2, రియల్‌ మీ వాచ్‌ 2 ప్రో స్మార్ట్‌ వాచ్‌ లను విడుదల చేసింది. దీంతో పాటు రియల్‌ మీ జిటి 5 జి స్మార్ట్‌ఫోన్‌, రియల్‌మీ ప్యాడ్‌, రియల్‌ మీ బుక్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
 
రియల్‌ మీ వాచ్‌ 2 ప్రైస్‌, ఫీచర్స్‌

రియల్‌మే వాచ్ 2 స్మార్ట్‌ ఫోన్‌ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ ప్లే, ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే  12 రోజుల వినియోగించుకునేలా బ్యాటరి వస్తుంది. ఇది IP68 (ఇంటర్నేషనల్‌ ప్రొటెక్షన్‌ కోడ్‌) డస్ట్ మరియు వాటర్-రెసిస్టెంట్ కోటింగ్‌ తో  మరియు 90 స్పోర్ట్స్ మోడ్‌లతో లభ్యమవుతుంది. అంతేకాదు బ్లడ్‌, ఆక్సిజన్ మరియు హార్ట్‌ బీట్‌ రేట్‌ ను కౌంట్‌ చేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్ ఫీచర్లను కలిగి ఉంది.దీని ధర 54.99 యూరోలు (సుమారు 4,889) తో కొనుగోలు చేయోచ్చు. నేటి నుండి రియల్‌మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. 

రియల్‌ మీ వాచ్‌ 2 ప్రో ప్రైస్  

'స్మార్ట్' రియల్‌ మీ వాచ్‌ 2ప్రో 1.75 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్‌మీ వాచ్ 2 మాదిరిగానే రియల్‌మీ వాచ్ 2 ప్రో ఐపి 68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కోటింగ్‌ తో  వస్తుంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్‌లు, 100 కి పైగా వాచ్ ఫేస్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్, మాగ్నెటిక్ ఛార్జింగ్ బేస్ ఫీచర్స్‌ ఉన్నాయి. రియల్‌మీ వాచ్ 2 ప్రో ధర 74.99 యూరోలకే (రూ. 6,889 సుమారు.) సొంతం చేసుకోవచ్చు. నేటి నుండి రియల్‌మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. 

రియల్‌ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ 

రియల్‌ మీ చెందిన రియల్‌ మీ టెక్‌ లైఫ్‌ రోబో వాక్యూమ్‌ విడుదలైంది.  స్మార్ట్ మ్యాపింగ్, నావిగేషన్ సిస్టమ్‌కు సహాయపడే లిడార్ సెన్సార్‌లతో సహా 38 ఇంటర్నల్‌ సెన్సార్‌లతో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌కు లిడార్ సెన్సార్ ఖచ్చితమైన రియల్ టైమ్ నావిగేషన్ మరియు ఖచ్చితమైన ఇన్-యాప్ రూమ్ మ్యాపింగ్ చేస్తుందని రియల్‌ మీ ప్రతినిథులు తెలిపారు. ఇక దాని పనితీరుకు సంబంధించి రియల్‌మీ టెక్‌లైఫ్ రోబోట్ సౌండ్‌ మోడ్‌లో శబ్దం స్థాయిలను 55dB కంటే తక్కువగా ఉంచుతుంది. 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 600 ఎంఎల్ డస్ట్ బిన్, 300 ఎంఎల్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. ఇది వాక్యూమ్ ఒకేసారి నేలని శుభ్రపరుస్తుంది మరియు తుడుచుకుంటుందని రియల్‌ మీ ప్రతినిధులు విడుదల సందర్భంగా చెప్పారు. 

చదవండి: Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top