
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జనవరి 25, ఫిబ్రవరి 9వ తేదీల్లో.. రెండు విడతలుగా సావరిన్ గ్రీన్ బాండ్లు (ఎస్‌జీఆర్ బాండ్స్) జారీ చేయనుంది.రెండు విడతల ద్వారా రూ.8,000 కోట్ల చొప్పున మొత్తం రూ.16,000 కోట్ల సమీకరణ లక్ష్యం.
కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు ఈ నిధులను సమకూర్చడం జరుగుతుంది. వార్షిక బడ్జెట్ (2022–23)లో ప్రకటించిన విధంగా, కేంద్ర ప్రభుత్వం తన మొత్తం మార్కెట్ రుణాలలో భాగంగా గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వనరులను సమీకరించడానికి సావరిన్ గ్రీన్ బాండ్‌లను జారీ చేస్తుంది.