డిజిటల్‌ లావాదేవీలు : ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI hikes limits for contactless card transactions to rs 5000 - Sakshi

కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపుల పరిమితి పెంపు

2 వేలు నుంచి 5 వేల వరకు, 2021 జనవరి నుంచి అమలు

సాక్షి, ముంబై: వరుసగా మూడవ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోకీ లక నిర్ణయం తీసుకుంది. మరింత కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకాన్ని  ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న కాంటాక్ట్ లెస్ కార్డు లావాదేవీల పరిమితిని 2 వేల రూపాయలనుంచి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.  (ఆర్‌బీఐ ఎఫెక్ట్‌- 45,000 దాటిన సెన్సెక్స్)

ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సమర్ధవంత, సురక్షితమైన, డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని శక్తికాంత దాస్  చెప్పారు. 24గంటలు,వారంరోజుల పాటు (24x7) ఆర్టీజీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు 4శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. ఈ నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.  కొవిడ్‌-19 ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గిస్తూ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని శక్తికాంత దాస్ చెప్పారు. (చదవండి : కల్తీ తేనె కలకలం : మరింత కరోనా ముప్పు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top