ఎగుమతిదార్లకు ‘రేజర్‌పే’ ఖాతా

Razorpay launches export account for SME merchants to receive international payments - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిన్‌టెక్‌ కంపెనీ రేజర్‌పే తాజాగా మనీసేవర్‌ ఎక్స్‌పోర్ట్‌ అకౌంట్‌ సేవలను ప్రారంభించింది. ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా జరిపే నగదు లావాదేవీల చార్జీలపై 50 శాతం వరకు పొదుపు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లు తమకు నచి్చన దేశంలో ఖాతాను తెరవడానికి, అలాగే రేజర్‌పే ప్లాట్‌ఫామ్‌ ద్వారా స్థానికంగా చెల్లింపులను స్వీకరించడానికి కంపెనీ సహాయం చేస్తుంది.

తద్వారా చార్జ్‌బ్యాక్స్, ట్రాన్స్‌ఫర్‌ ఖర్చులను నివారించవచ్చు’ అని రేజర్‌పే వెల్లడించింది. మనీసేవర్‌ ఎక్స్‌పోర్ట్‌ అకౌంట్‌తో 160 దేశాల నుండి బ్యాంకుల ద్వారా నగదును స్వీకరించడానికి ఎగుమతిదారులకు వీలు కలుగుతుంది. అన్ని చెల్లింపులు ఎల్రక్టానిక్‌ ఫారెన్‌ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్‌ స్టేట్‌మెంట్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 10,000 పైచిలుకు మంది ఎగుమతిదార్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని రేజర్‌పే చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రాహుల్‌ కొఠారి చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top