దేశంలో ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్-ఈ ఫండింగ్‌లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.
ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్ క్లబ్‌లో చేరింది. ఒక బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.
బైక్ ట్యాక్సీ సర్వీస్‌గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్ గుంటుపల్లి, అరవింద్ శంఖ, రుషికేష్‌లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment