‘సువర్ణభూమి’ కొత్త లోగోను ఆవిష్కరించిన రాంచరణ్‌

RamCharan Launches Suvarnabhoomi Infra Developers New logo - Sakshi

రాయదుర్గం: ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ సంస్థ సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నూతన లోగోను ఆవిష్కరించింది. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో కొత్త లోగో, యాడ్‌ ఫిల్మ్‌ను సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం సినీ హీరో రాంచరణ్‌ ఆవిష్కరించారు.  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనకంటూ ప్రత్యేకతను, వినియోగదారుల మన్ననలను పొందుతున్న సంస్థగా సువర్ణభూమి నిలుస్తోందని రాంచరణ్‌ ప్రశంసించారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సువర్ణభూమి సంస్థతో పనిచేయడం, బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడం సంతోషం కలిగిస్తోందన్నారు. అందుబాటు ధరలలో అపార్ట్‌మెంట్లు, విల్లాలను  వినియోగదారులకు  అందించడం అభినందించదగ్గ విషయమన్నారు.  ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని  కలిగిస్తున్న సువర్ణభూమి సంస్థను అభినందించారు.  సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ ఆధునిక సకల సౌకర్యాలతోపాటు సరసమైన ధరలకు ఫ్లాట్స్, విల్లాలతో పాటు స్థలాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top