ఆకాశ ఎయిర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వేసవి నుంచి ఝున్‌ఝున్‌వాలా విమానాలు

Rakesh Jhunjhunwala-backed Akasa Air gets no-objection certificate - Sakshi

నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ

2022లో కార్యకలాపాలు!

Akasa Airlines Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా  మద్దతు ఉన్న ఈ సంస్థకు.. పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)’ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.  దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్‌ హోల్డింగ్‌ సంస్థ ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్కొంది.

‘ఎన్‌వోసీ జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు‘ అని ఆకాశ ఎయిర్‌ సీఈవో వినయ్‌ దూబే తెలిపారు.  రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఆకాశ ఎయిర్‌ బోర్డులో ప్రైవేట్‌ రంగ ఎయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ కూడా ఉన్నారు. సీఈవోగా నియమితులైన దూబే గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్‌ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

చదవండి: బిగ్‌బుల్‌ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ

ఇదీ చదవండి: ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top