Sakshi News home page

Bullet Baba Temple: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Published Tue, Jul 11 2023 6:29 PM

Rajasthan Bullet Baba Get the Story of Royal Enfield Bullet Om Bannas Temple - Sakshi

ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్‌లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది.

బుల్లెట్ బాబా..
ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు.

ఓం సింగ్ రాథోడ్‌ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్‌సైకిల్‌కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

(ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..)

ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్‌సైకిల్‌దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.

(ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!)

Advertisement

What’s your opinion

Advertisement